మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Shiva Rama Ashtakam – శ్రీ శివరామాష్టకం

శివ హరే శివరామసఖే ప్రభో
త్రివిధతాపనివారణ హే విభో |
అజజనేశ్వరయాదవ పాహి మాం
శివ హరే విజయం కురు మే వరమ్ || 1 ||

కమలలోచన రామ దయానిధే
హర గురో గజరక్షక గోపతే |
శివతనో భవశంకర పాహి మాం
శివ హరే విజయం కురు మే వరమ్ || 2 ||

సుజనరంజనమంగలమందిరం
భజతి తే పురుషః పరమం పదమ్ |
భవతి తస్య సుఖం పరమాద్భుతం
శివ హరే విజయం కురు మే వరమ్ || 3 ||

జయ యుధిష్ఠిరవల్లభ భూపతే
జయ జయార్జిత పుణ్యపయోనిధే |
జయ కృపామయ కృష్ణ నమోఽస్తు తే
శివ హరే విజయం కురు మే వరమ్ || 4 ||

భవవిమోచన మాధవ మాపతే
సుకవిమానసహంస శివారతే |
జనకజారత రాఘవ రక్ష మాం
శివ హరే విజయం కురు మే వరమ్ || 5 ||

అవనిమండలమంగళ మాపతే
జలదసుందర రామ రమాపతే |
నిగమకీర్తిగుణార్ణవ గోపతే
శివ హరే విజయం కురు మే వరమ్ || 6 ||

పతితపావన నామమయీ లతా
తవ యశో విమలం పరిగీయతే |
తదపి మాధవ మాం కిముపేక్షసే
శివ హరే విజయం కురు మే వరమ్ || 7 ||

అమరతాపరదేవ రమాపతే
విజయతస్తవ నామధనోపమా |
మయి కథం కరుణార్ణవ జాయతే
శివ హరే విజయం కురు మే వరమ్ || 8 ||

హనుమతః ప్రియచాపకర ప్రభో
సురసరిద్ధృతశేఖర హే గురో |
మమ విభో కిము విస్మరణం కృతం
శివ హరే విజయం కురు మే వరమ్ || 9 ||

అహరహర్జన రంజనసుందరం
పఠతి యః శివరామకృతస్తవమ్ |
విశతి రామరమాచరణాంబుజే
శివ హరే విజయం కురు మే వరమ్ || 10 ||

ప్రాతరుత్థాయ యో భక్త్యా పఠేదేకాగ్రమానసః |
విజయో జాయతే తస్య విష్ణుమారాధ్యమాప్నుయాత్ || 11 ||

ఇతి శ్రీరామానందవిరచితం శ్రీశివరామస్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.